నిర్భయ అత్యాచార దోషులకు ఉరిశిక్ష

Dhana Lakshmi
నిర్భయ అత్యాచార కేసుకు సంబంధించి  దోషులకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పటికి ఆ దుర్మార్గులకు శిక్ష పడుతున్నందుకు  దేశవ్యాప్తంగా తృప్తి పొందుతున్నారు .  ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల నుంచి బిహార్‌లోని బక్సర్ జైలుకు    సందేశం వచ్చింది. ఇంతకీ ఆ సందేశంలో ఏముంది అనుకుంటున్నారు  డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశం యొక్క ముఖ్య  సారాంశం.  

 

బక్సర్ జైలుకు ఉరితాళ్లను రూపొందించడంలో ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. గతంలో అఫ్జల్ గురును పార్లమెంటుపై దాడులు చేసిన తీరుపై ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు. తాజాగాబక్సర్ జైలుకు .. మరోసారి ఉరితాళ్లు పంపించాలని  జైళ్ల శాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు.

దీనిపై బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ..  10 ఉరితాళ్లను డిసెంబర్ 14లోగా సిద్దం చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి అని వివరించాడు . నిజానికి ఇవి ఎక్కడ ఉపయోగించబోతున్నారో మాకు ఏ మాత్రం తెలియదు.  ఉరితాళ్లను సిద్ధం చేయడంలో బక్సర్ జైలుకి మంచి అనుభవం ఉంది . సుమారు ఒక్క ఉరితాడును సిద్ధం చేయడానికి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా వీటి తయారీలో  యంత్రాలను తక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.  

పాటియాలా జైలు నుంచి మాకు ఉరితాళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు 2016-17లో కూడా వచ్చాయి. చివరిసారిగా బక్సర్‌ జైలు నుంచి తయారుచేసి పంపించిన ఉరితాడు ధర రూ.1,725అని అరోరా తెలిపారు. ఇనుము, ఇత్తడి ధరలలో తేడాల కారణంగా వీటి ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అరోరా తెలిపారు. ఈ లోహాలను తాడు మెడను గట్టిగా చుట్టి ఉండేలా చూసుకోవడానికి ఉపయోగిస్తారని జైలు సూపరింటెండెంట్ వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: